హుటాహుటిన అమిత్ షా ఇంటికి రేవంత్, డీజీపీ (Video)

కలం, వెబ్ డెస్క్: మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి (Maoist Ganapathi) లొంగిపోయినట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఢిల్లీలో ఆయన సరెండర్ అయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. విమానాశ్రయం నుంచి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోం‌మంత్రి అమిత్ షా‌తో సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్, ఐజీ సుమతి భేటీ అయినట్టు సమాచారం. మావోయిస్టుల లొంగుబాటుపై కేంద్ర హోం మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మార్చ్ 31న జరిగే మావోయిస్టు రహిత భారత్ కాన్ఫరెన్స్‌పైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

సీఎం రేవంత్, డీజీపీ ఒకే కారులో ప్రయాణిస్తున్న వీడియో కింద ఉంది చూడవచ్చు.

Read Also: అంగరంగ వైభవంగా ‘విరోష్’ రిసెప్షన్.. హాజరైన సినీ ప్రముఖులు

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>