కలం, కరీంనగర్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా మార్పులు చేపట్టాలని అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మానకొండూర్ (Manakondur) నియోజకవర్గంలోనూ మండల పార్టీ అధ్యక్షుల మార్పుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పార్టీ మండలాధ్యక్షుల జాబితాను మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీసెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం విడుదల చేశారు.
మానకొండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ద్యావ శ్రీనివాస్ రెడ్డి(జగ్గయ్యపల్లి), శంకరపట్నం మండల పార్టీ అధ్యక్షునిగా బండారి తిరుపతి(కేశవపట్నం), గన్నేరువరం మండల పార్టీ అధ్యక్షునిగా బొడ్డు సునిల్ (గన్నేరువరం), బెజ్జంకి మండల పార్టీ అధ్యక్షునిగా లింగాల శ్రీనివాస్ (బెజ్జంకి),తిమ్మాపూర్ మండల పార్టీ అద్యక్షునిగా బండారి రమేశ్ (పోలంపల్లి), ఇల్లంతకుంట మండల పార్టీ అధ్యక్షునిగా కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి(ముస్కానిపేట్) లను నియమించారు. అయితే. తిమ్మాపూర్, ఇల్లంతకుంట మండలాల్లో పాత వారికే తిరిగి అవకాశం కల్పించగా, మిగిలిన నాలుగు మండలాల్లో అధ్యక్షులను మార్చి కొత్త వారికి పగ్గాలు అప్పగించారు.అవకాశం కల్పించారు.
కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం తదితర అంశాలపై అధికార కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించినట్టు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆ దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంలో భాగంగానే నియోజకవర్గంలో చేర్పులు, మార్పులు చేపట్టినట్టు ఆయన వివరించారు.
పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన వారంతా కాంగ్రెస్ బలోపేతానికి కష్టపడి పని చేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు పర్యాయాలు కొనసాగడం, రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే మనందరి లక్ష్యం కావాలని, ఆ దిశగా పని చేయాలన్నారు. పార్టీ మండలాధీశులుగా నియామకమైన వారికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి అభినందించారు. అలాగే పార్టీ మాజీ మండల అధ్యక్షులు అందించిన సేవలను కవ్వంపల్లి కొనియాడుతూ, త్వరలో వారికి సముచిత స్థానం కల్పిస్తామని డాక్టర్ కవ్వంపల్లి తెలిపారు.

