విషాదం.. నీటి గుంటలో వ్యక్తి మృతదేహం లభ్యం

​కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం (Keshavapatnam) మండలం కేశవపట్నంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక పాత సినిమా థియేటర్ ఆవరణలోని నీటి గుంటలో ఓ వ్యక్తి మృతదేహం తేలియాడటం తీవ్ర కలకలం రేపింది. కేశవపట్నం పాత థియేటర్ ఆవరణలో ఉన్న నీటి గుంటలో గురుతు తెలియని మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి మృతదేహాన్ని వెలికితీశారు.

​మృతుడిని అంబాలపూర్ గ్రామానికి చెందిన రావణవేణి శంకర్ (54) గా స్థానికులు గుర్తించారు. శంకర్ గత కొంతకాలంగా కేశవపట్నంలోని చికెన్ సెంటర్లలో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకుని, శంకర్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. శంకర్ మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ప్రమాదవశాత్తు నీటి గుంటలో జారిపడి మృతి చెందాడా? లేక దీని వెనుక ఏదైనా కుట్ర లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అనే పలు కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే శంకర్ మృతిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>