కలం, వెబ్ డెస్క్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) హర్షం వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత, నిరంతర అభివృద్ధిని అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఖర్గే స్పష్టం చేశారు. ప్రజా తెలంగాణ కోసం కాంగ్రెస్ (Congress) కట్టుబడి ఉందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల్లో లభించిన ఈ విజయం రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ప్రేరణనిస్తుందని ఖర్గే అభిప్రాయపడ్డారు. అలాగే మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ.వేణుగోపాల్ సైతం స్పందించారు. ఈ అద్భత ఫలితాలు కాంగ్రెస్ పాలనకు నమూనా అని ఆయన అన్నారు.


