కాల్వ గ్రామంలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

కలం, దిలావర్పూర్: దిలావర్పూర్ మండలంలోని కాల్వ గ్రామం (Kalwa Village) లో గంగపుత్రుల ఐక్యత వేదిక ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని (World Fisheries Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు జెండాను ఆవిష్కరించారు. మత్స్యకారుల ఐక్యత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సంఘటితంగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. మత్స్యకారుల అభ్యున్నతికి ఐక్యతే బలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు సాయన్న, నవీన్, రవి, సవీన్, శ్రీనివాస్, నారాయణ, నర్సయ్య, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి సంవత్సరం నవంబర్ 21వ తేదీన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మత్స్యకారుల శ్రమను గుర్తించడం, ఆహార భద్రతలో మత్స్యరంగం పాత్రను చాటడం, సముద్ర, జల పర్యావరణ వ్యవస్థల పరిరక్షణపై అవగాహన కల్పించడమే దీని ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు.

Also Read : పెళ్లి పీట‌లెక్క‌నున్న స‌చిన్ కుమార్తె.. వ‌రుడు ఎవ‌రంటే?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>