డ్రగ్స్ మహమ్మారిపై పోరుకు మెగాస్టార్ కీలక పిలుపు!

కలం, వెబ్ డెస్క్ : యువత బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన ‘నషా ముక్త్ భారత్ (Nasha Mukt Bharat) యాత్ర’కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన యువతకు కీలక పిలుపునిచ్చారు. మత్తుపదార్థాల ఉచ్చులో పడి యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, నగర ప్రజలందరూ స్వచ్ఛందంగా కిషన్ రెడ్డి చేపట్టిన ‘నషా ముక్త్ భారత్ యాత్ర’లో పాలుపంచుకుని యువతలో అవగాహన కల్పించాలన్నారు.

ఈ మేరకు సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ రక్కసిపై పోరాటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఈ సామాజిక చైతన్య ఉద్యమంలో ముందుండి చేయి కలపాలని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పిలుపునిచ్చారు. తాను.. నషా ముక్త్ భారత్ పాదయాత్రలో పాల్గొనబోతున్నానని చెప్పారు. ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత నవభారత నిర్మాణం కోసం మనమందరం ఒక్కటై ముందుకు సాగాలని తెలిపారు. కాగా, 2029 నాటికి భారతదేశాన్ని పూర్తిగా డ్రగ్స్ రహిత దేశంగా తీర్చిదిద్దాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా, హైదరాబాద్ వేదికగా నిన్న మొదలైన ‘నషా ముక్త్ భారత్ యాత్ర’ 27 వరకు కొనసాగనుంది. చిరంజీవితో పాటు టాలీవుడ్ నటులు నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్ తదితర ప్రముఖులు కూడా ఈ ప్రజా ఉద్యమానికి బాసటగా నిలిచారు.

Also Read : హైవేనే రన్‌వేగా.. ఆర్మీ విమానాల చారిత్రక ల్యాండింగ్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>