కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ జిల్లా వడ్లపూడి (Vadlapudi) లోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ప్లాస్టిక్ డబ్బాలు, లారీ టైర్లు, ప్లాస్టిక్ పైపులు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా మంటలు, పొగ వెలువడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా, దుకాణంలో మొత్తం ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఘటన కు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

