Mobile Popup Ad
Mobile Popup Ad

సుకుమార్ నాతో సినిమా ప్లాన్ చేశారు : దేవిశ్రీ ప్రసాద్

కలం, సినిమా : రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్(DSP) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదిరిపోయే మాస్ బీట్స్‌తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీ.. తాజాగా హీరోగా ప్రేక్షకులను పలుకరించనున్నాడు. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి (Venu Yeldandi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ “ఎల్లమ్మ” (Yellamma) తో  దేవిశ్రీప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఎల్లమ్మ గ్లింప్స్ ఎంతగానో ఆకట్టుకోగా.. దేవిశ్రీ లుక్ సైతం అదిరిపోయింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజా ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ (DSP) తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దర్శకుడు సుకుమార్(Sukumar) తనను హీరోగా పరిచయం చేయాలని.. ఒక సినిమా ప్లాన్ చేసినట్లు తెలిపారు. అయితే తన తండ్రి మరణం తర్వాత ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని చెప్పారు. తనకు నటనపై ఆసక్తి ఉందని, అయితే సరైన సమయం, కథ కోసం ఎదురు చూస్తున్నట్లు దేవిశ్రీ  వెల్లడించారు. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీశ్ శంకర్, అలాగే నిర్మాత దిల్ రాజు ఎప్పటికప్పుడు నటన వైపు అడుగులు వేయాలని తనను ప్రోత్సహిస్తూనే ఉన్నారని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>