కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డి (Jeevan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీని వీడటంపై ఆలోచిస్తున్నానని బాంబ్ పేల్చారు. ఈ విషయాన్ని నేడు జగిత్యాలలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. తనది కాంగ్రెస్ తో 4 దశాబ్దాల అనుబంధమని గుర్తు చేసుకున్నారు. పార్టీని వీడాలని తాను కోరుకోవడం ఎంత బాధాకరమో తనకు తెలుసునని చెప్పుకొచ్చారు. కాగా, సుధీర్ఘకాలం పార్టీలో కొనసాగిన జీవన్ రెడ్డి రాజీనామా చేయడంపై ఆలోచిస్తున్నా అని అనడం… అదీ అధికారంలో ఉండగా చేయడం తెలంగాణ కాంగ్రెస్ పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.
కాగా, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని కుటుంబం నుండి వచ్చి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి స్థాయికి చేరుకున్నారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి హవా కొనసాగుతున్న సమయంలోనూ కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎమ్మెల్సీగా కూడా గెలిచారు. చివరకు తెలంగాణ కాంగ్రెస్ (TPCC) అధ్యక్ష రేసులో కూడా నిలిచారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగినా జగిత్యాలలో మాత్రం ఓడిపోయింది. ఇక్కడ జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత సంజయ్ కాంగ్రెస్ లో చేరారు. దీంతో జీవన్ రెడ్డి పరిస్థితి దారుణంగా మారింది.
ఇటీవల జీవన్ రెడ్డికి రాజకీయంగా గుర్తింపు తగ్గింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోలేదు. జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో అధిష్ఠానం సంజయ్ వర్గీయులకే ఎక్కువగా అవకాశం ఇచ్చారు. తాజా పరిణామాలను గమనిస్తున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ కొవలోనే పార్టీని వీడటంపై ఆలోచిస్తున్నానని ప్రకటన చేశారు. కార్యకర్తలతో చర్చిస్తున్నానని.. ఉగాది తర్వాత తన తుది నిర్ణయం చెబుతానని వెల్లడించారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపితే.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సంజయ్‌తో కలిసి పనిచేయనని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తన తదుపరి చర్యలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందోననే అంశం ఆసక్తికరంగా మారింది. సంజయ్‌కు (MLA Sanjay), జీవన్‌రెడ్డికి సయోధ్య కుదురుస్తుందా?, జీవన్ రెడ్డిలాంటి వాళ్లనే పక్కనపెట్టేలా? ఏమైనా సంచలన నిర్ణయం ఏదైనా తీసుకుంటుందో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది. ఈ నెల 25న జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారని .. ఈ విషయంపై జీవన్‌రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మాట్లాడారని సమాచారం అందుతోంది. మరి జీవన్ రెడ్డి హస్తం కు గుడ్ బై చెప్పి.. కారులోకి ఎక్కెస్తారా? లేదా మరే ఇతర ఆలోచన చేస్తారా? అనే అంశం ఇంట్రెస్టింగ్ గా మారింది.
Read Also: కౌశిక్ రెడ్డి పోలీసులను బెదిరిస్తున్నాడు: కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు
Follow Us On: Instagram

