కలం, వెబ్ డెస్క్: ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో హైదరాబాద్ (Hyderabad)లో చోటుచేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్, VST స్టీల్ బ్రిడ్జ్ (VST Steel Bridge) పైనుంచి ఒక యువకుడు కిందికి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడిని రాంనగర్‌కు చెందిన మనోజ్‌గా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. మనోజ్ శివం రోడ్‌లోని అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం మనోజ్ తన బైక్‌పై బ్రిడ్జి పైకి వచ్చి బైక్‌ను అక్కడే పార్క్ చేశాడు. తన ఫోన్‌లో సూసైడ్ నోట్ రాసి బైక్‌పైనే ఉంచి, బ్రిడ్జి పైనుంచి రోడ్డుపైకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బైక్‌పై ఉన్న అతని ఫోన్‌ను పరిశీలించగా, అందులో ఒక సూసైడ్ నోట్ లభించింది. తన చావుకు ఎలాంటి అప్పులు కారణం కాదని, తాను ప్రేమించిన అమ్మాయే తన చావుకు కారణమంటూ సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చాడు మనోజ్. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

