కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పర్యావరణ పరిరక్షణ అందరి ధ్యేయం కావాలని మహబూబ్ నగర్ (Mahabubnagar) మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో RRR (Reduce, Reuse, Recycle) సెంటర్, వర్మీ కంపోస్ట్ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. నగరంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టడానికి , పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఈ RRR సెంటర్ ఎంతో అవసరమన్నారు. ప్రజలు తమ ఇళ్లల్లో పాత ప్లాస్టిక్ సీసాలు, పేపర్లు, కార్డ్‌బోర్డులు, ఇనుప వస్తువులను ఇచ్చి, నిర్ణీత ధరల పట్టిక ప్రకారం నగదు పొందవచ్చన్నారు. అలాగే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఇక్కడి వర్మీ కంపోస్ట్ యూనిట్ నెలకొల్పుతున్నట్లు వివరించారు. డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్ రెడ్డి పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

