సీజ‌న‌ల్ వ్యాధులు అరిక‌ట్టేందుకే ‘ఫ్రైడే డ్రై డే’ : డీఎంహెచ్‌ఓ

కలం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో : మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లా (Mahabubnagar ) వైద్యారోగ్య శాఖాధికారి డా. ఏ. శ్రీనివాసులు అమిస్తాపూర్ గ్రామములో ఆశలు, ఏ ఎన్ ఎమ్ లు నిర్వహిస్తున్న “ఫ్రై డే -డ్రై డే”కార్యక్రమమును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా డా. ఏ. శ్రీనివాసులు మాట్లాడుతూ.. దోమల ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టడానికి ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే డ్రై డే’ (Friday Dry Day) కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని, ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నిలిచిపోయిన నీటిని తొలగించడం దీని ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు.

ఫ్రైడే డ్రై డే ముఖ్య ఉద్దేశంపై డా. ఏ. శ్రీనివాసులు స్పందిస్తూ.. దోమల సంతానోత్పత్తిని, వాటి వృద్ధిని పూర్తిగా అరికట్టడం.. తద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి ప్రజలను రక్షించడం అని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. నీటి నిల్వలు తొలగింపులో భాగంగా ప్రజలు ఇళ్లలో, పరిసరాల్లోని పనికిరాని పాత డబ్బాలు, టైర్లు, పూల కుండీలు, కొబ్బరి బొండాలలో నీరు నిల్వ ఉండకుండా చూసి వాటిని తొలగించాలని సూచించారు.

నిల్వ ఉంచిన తాగునీటి పాత్రలు, ఓవర్ హెడ్ ట్యాంకులకు విధిగా మూతలు పెట్టాలని డా. ఏ. శ్రీనివాసులు తెలిపారు. ఇళ్ల చుట్టూ ఉన్న చిన్న నీటి గుంతలను మట్టితో పూడ్చివేయాలని తెలిపారు. ప్రతీ వారం ప్రజలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి ఇంటింటికి తిరిగి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమములో ప్రోగ్రాం అధికారి డా. శివకాంత్, భూత్పూర్ వైద్యాధికారి డా. అబ్దుల్ రబ్, హెల్త్ ఎడ్యుకేటర్ హన్మంతు, ఏ. ఎన్ ఎమ్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>