కలం , మహబూబ్‌నగర్ బ్యూరో : ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయమని మహబూబ్‌నగర్ (Mahabubnagar) డీసీసీ అధ్యక్షుడు ఏ సంజీవ్ ముదిరాజ్ అన్నారు. బుధవారం ఆయన మహబూబ్‌నగర్‌లోని పలు ప్రాంతాలను పరిశీలించి ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.16వ డివిజన్ పరిధిలోని బోయపల్లి, మహమ్మద్ ఖాన్‌పల్లి తండాలో నెలకొన్న వార్డు సమస్యలను పరిశీలించేందుకు డీసీసీ అధ్యక్షులు ఏ. సంజీవ్ ముదిరాజ్ పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు, స్థానిక నాయకులకు డీసీసీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీరాబాయి, శీను నాయక్, తండా పెద్దలు వి. గోపాల్ నాయక్, వీరుక్యా నాయక్, వి. లక్ష్మణ్, కే. రవి, వి. కాంత్ కుమార్, కే. రాజేష్, కే. హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

