ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కుష్బూ గుప్తా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజావాణి (Prajavani) లో అర్జీదారుల నుండి వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా (Khushboo Gupta) అధికారులకు ఆదేశించారు. సోమవారం మహబూబ్ నగర్ (Mahabubnagar) కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కుష్బూ గుప్తా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా అర్జీదారుల సమస్యలను సావధానంగా విన్నారు. ప్రతి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు. అధికారులు ప్రజావాణి దరఖాస్తులను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని అన్నారు. ప్రజావాణిలో పంచాయతీరాజ్, మున్సిపల్, జిల్లా సంక్షేమం, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖ, భూ సర్వే రికార్డులు, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, పోలీస్, గిరిజన అభివృద్ధి శాఖ, ప్రణాళిక శాఖ, విద్యుత్ శాఖ, విద్య, వైద్య ఆరోగ్యం , అటవీ, గ్రామీణ అభివృద్ధి, తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 112 వినతులను అధికారులు స్వీకరించారు.

జిల్లా అధికారులతో సమీక్ష

ప్రజావాణి (Prajavani) అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి రెవెన్యూ, పంచాయతీరాజ్, కలెక్టరేట్‌లో అధికంగా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. నెలకు పైగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, కలెక్టరేట్ విభాగాలు సహా అన్ని శాఖలు వారానికి ఒకసారి పెండింగ్ ఫిర్యాదులను సమీక్షించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో హెల్మెట్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం నుంచి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై వచ్చే ఉద్యోగులను కలెక్టరేట్‌లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అన్ని శాఖాధిపతులు తమ పరిధిలోని ఉద్యోగులకు తెలియజేసి తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.

ఇండియన్ రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడి ఉందని స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. ప్రతి జిల్లా అధికారి కనీసం రూ. 250 సభ్యత్వ రుసుము చెల్లించి సభ్యత్వం పొందాలని కోరారు. తమ శాఖలోని ఉద్యోగులందరినీ కూడా సభ్యత్వం పొందేలా ప్రోత్సహించాలని సూచించారు.

ఎస్‌ఐఆర్–2026 ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ప్రతి ఒక్కరూ వాటిని గడువులోగా బీఎల్‌ఓ లకు తిరిగి సమర్పించేలా గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు.

పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వ్యవసాయ, విద్య, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల ఫీల్డ్ సిబ్బంది ఈ ప్రక్రియలో పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎంపీడీఓలు, తహశీల్దార్లు, ఏపీఓలు, ఏపీఎం లు తమ పరిధిలోని సిబ్బందిని సమన్వయం చేసి ప్రతి పోలింగ్ కేంద్రంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ ,భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్ రెడ్డి, డి.ఆర్.ఓ ఎ .నిర్మల, జడ్.పి.సి.ఈ.ఓ, ఇన్.ఛార్జ్ డి.పి.ఓ వెంకట రెడ్డి, డి.ఆర్.డి.ఓ నరసింహులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఆయనకు సారీ చెప్పిన కేటీఆర్.. కారణమిదే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>