కలం, కరీంనగర్ : బీజేపీ ఓబీసీ మోర్చా నూతన కరీంనగర్ జిల్లా కమిటీని (OBC Morcha Committee) మంగళవారం జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ సూచన మేరకు నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆకుల రాజేందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేయాలనే సంకల్పంతో పాటు బీసీల ఐక్యత, బీజేపీ ఓబీసీ మోర్చా బలోపేతం, భారతీయ జనతా పార్టీ పటిష్టత కోసం నూతన ఓబీసీ జిల్లా కార్యవర్గం పనిచేయాలని ఆకుల రాజేందర్ సూచించారు.
నూతన కమిటీ వివరాలు
జిల్లా ఉపాధ్యక్షులుగా మియ్యపురం లక్ష్మణచారి, వంగల రవిగోపాల్, ఎర్రోజు లక్ష్మణ్, జక్కుల శంకర్, నరాల రాజశేఖర్, కొయ్యడ అశోక్ యాదవ్ నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా కడార్ల రతన్ కుమార్, గర్దాస్ సతీష్, కొక్కర్ల మల్లేష్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. కార్యదర్శులుగా మచికట్ల మల్లేష్, ముత్యాల రవీందర్, బత్తిని మహేష్, బత్తిని స్వామి గౌడ్, వొడ్నాల చంద్రిక, పెరూరి అశ్విని నియమితులయ్యారు.
కోశాధికారిగా ఎర్రోజు రఘు, మీడియా సెల్ కన్వీనర్‌గా ఇంగ్లె ప్రభాకర్, కో-కన్వీనర్‌గా సారంపల్లి రాజు, మన్ కీ బాత్ కన్వీనర్‌గా కొత్తకొండ దీపక్, కో-కన్వీనర్‌గా బండారి శ్రీనివాస్, లాభార్థి ప్రముఖ్‌గా అటికం రాంచంద్రం నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా పొనగంటి రవికుమార్, చిందం ఆంజనేయులు, పండారి కొమురయ్య గౌడ్, నడికూడ కుమార్, బాగోజి గంగాధరచారి, మండల సాయిబాబా యాదవ్, దాసరి రవి, సమ్మిల్ల విజేందర్, రాపెల్లి శ్రీనివాస్, గుర్రం సురేష్ గౌడ్ తదితరులు నియమితులయ్యారు.

