లారీ, కారు ఢీ.. ఒకే రోజు ఒకే చోట రెండు ప్రమాదాలు!

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి-44 (NH 44)పై గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంతకుముందు రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగడంతో ఓ డ్రైవర్ సజీవ దహనం కావడంతో పోలీసులు రహదారిపై వాహనాల రాకపోకలను వన్‌వేగా మళ్లించారు. ఈ క్రమంలో అదిలాబాద్ వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇన్నోవా కారు, ఎదురుగా అదిలాబాద్ వైపు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఒకే రోజు, ఒకే ప్రదేశంలో వరుసగా రెండు రోడ్డు ప్రమాదాలు జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ప్రమాదాలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>