స్వనిధి ప్రచారంతో వీధి వ్యాపారులకు ఊతం

కలం, నిర్మల్ : వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసి, వారి వ్యాపారాల అభివృద్ధికి చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లోక్ కళ్యాణ్ మేళాపై (Lok Kalyan Mela) భైంసా మున్సిపల్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1 నుంచి 30, 2026 వరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక స్వనిధి ప్రచారం, లోక్ కళ్యాణ్ మేళా మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల పరిధిలో, వివిధ బ్యాంకు శాఖలలో అర్హులైన వీధి వ్యాపారులకు బ్యాంకు రుణాలు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. వీధి వ్యాపారులు తమ వ్యాపారాలను మరింత విస్తరించుకోవడంతో పాటు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న స్వనిధి పథకం (PM SVANidhi) ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి వీధి వ్యాపారి లోక్ కళ్యాణ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు కుమార్, నరేష్ బాబు, ప్రియమ్ జీత్ సింగ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>