మెస్సీకి షాక్.. ఎంఎల్ఎస్ భారీ జరిమానా!

క‌లం, వెబ్‌డెస్క్‌: అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ (Lionel Messi)కి మేజర్ లీగ్ సాకర్ (MLS) షాక్ ఇచ్చింది. ప్రత్యర్థి ఆటగాడి మెడపై చేయి చేసుకున్నందుకు జరిమానా విధించింది. ఫిలడెల్ఫియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ మియామీ, ఫిలడెల్ఫియా మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ ముగిసే సమయంలో మెస్సీ, ఫిలడెల్ఫియా ఆటగాడు క్విన్ సలీవన్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో బంతి మరో వైపు ఉంది. ఇద్దరి మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం జరిగింది.

ఆ తర్వాత మెస్సీ సలీవన్ మెడ వెనుక భాగంలో చేయి వేశాడు. దీంతో సలీవన్ కూడా మెస్సీకి ఎదురుగా నిలబడ్డాడు. ఇద్దరూ కొద్దిసేపు ఒకరినొకరు సవాల్ చేసినట్టుగా కనిపించారు. రిఫరీ ఫిలిప్ డుజిక్ ఈ ఘటనను వెనుక వైపు ఉండటంతో చూడలేకపోయాడు. తర్వాత అక్కడికి చేరుకుని ఇద్దరినీ విడదీశాడు. అయితే ఎవరికీ కార్డు చూపించలేదు. ఈ ఘటనపై ఎంఎల్ఎస్ డిసిప్లినరీ కమిటీ చర్య తీసుకుంది. ప్రత్యర్థి ముఖం, తల లేదా మెడపై చేయి చేసుకోవడాన్ని నిషేధించే లీగ్ నిబంధనను మెస్సీ ఉల్లంఘించాడని పేర్కొంది.

అతడికి ఎంత జరిమానా విధించారో వెల్లడించలేదు. ఇంటర్ మియామీ ఆటగాడు ఇయాన్ ఫ్రేకి కూడా ఇదే కారణంతో జరిమానా విధించింది. అతడికి విధించిన మొత్తాన్ని కూడా ఎంఎల్ఎస్ వెల్లడించలేదు. మరోవైపు, మ్యాచ్ చివర్లో జరిగిన ఘర్షణకు ఫిలడెల్ఫియా ఆటగాడు కవాన్ సలీవన్, మియామీ మిడ్‌ఫీల్డర్ యానిక్ బ్రైట్‌లను రిఫరీ బయటకు పంపాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>