మెస్సీ మరో రికార్డ్.. ప్రపంచంలో ఏకైక ఫుట్‌బాలర్‌గా..

అర్జెంటీనా(Argentina) స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ(Lionel Messi) మరో రికార్డ్ సృష్టించారు. 1300 గోల్స్‌కు సహకారం అందించిన తొలి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఇంటర్ మియామీ తరుపున తాజాగా ఆడిన మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్ చేశాడు. అదే విధంగా జట్టుకు మూడు గోల్స్ చేయడంల అసిస్ట్ చేశాడు. దీంతో మెస్సీ ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. మెస్సీ ఇప్పటి వరకు 896 గోల్స్ చేశాడు, 1300 గోల్స్ చేయడంలో జట్టుకు సహకరించాడు. అదే విధంగా 12 గోల్స్‌కు కంట్రిబ్యూట్ చేసి ఎంఎల్ఎస్ ప్లేఆఫ్ రికార్డ్‌ను తన సొంతం చేసుకున్నాడు. ఈ 12 గోల్స్ 6గోల్స్ మెస్సీ స్వయంగా చేయగా మరో 6గోల్స్ చేయడంలో జట్టుకు మద్దతుగా నిలిచాడు.

మెస్సీ(Lionel Messi) పేరుపై ఉన్న రికార్డ్‌లు ఇవే..

క్లబ్, వ్యక్తిగత రికార్డులు

అత్యధిక బాలన్ డి’ఓర్ అవార్డులు – 8

అత్యధిక యూరోపియన్ గోల్డెన్ షూ అవార్డులు – 6

ఒకే క్లబ్ కోసం అత్యధిక గోల్స్ – బార్సెలోనాకు 672 గోల్స్

ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక గోల్స్ – 2012లో 91 గోల్స్

లా లీగాలో అత్యధిక గోల్స్ – 474

లా లీగాలో అత్యధిక అసిస్టులు – 192+

చాంపియన్స్ లీగ్‌లో అత్యధిక హ్యాట్రిక్‌లు లో ముందువరుసలో

ఒకే సీజన్‌లో అత్యధిక గోల్స్ (క్లబ్ + దేశం) – 73 (2011–12)

అర్జెంటీనాతో రికార్డులు

అర్జెంటీనాకు ఆల్-టైం టాప్ స్కోరర్

అర్జెంటీనాకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు

కోపా అమెరికాలో అత్యధిక అసిస్టులు

ఫిఫా వరల్డ్ కప్‌లో అత్యధిక నిమిషాలు ఆడిన ఆటగాడు (వరల్డ్ కప్ చరిత్రలో)

వరల్డ్ కప్ టోర్నమెంట్ MVP (గోల్డెన్ బాల్) – 2014, 2022

జట్టు విజయాలు

ఫిఫా వరల్డ్ కప్ – 2022 – 1

కోపా అమెరికా – 2021 – 1

UEFA చాంపియన్స్ లీగ్ టైటిల్స్ – 4

లా లీగా టైటిల్స్ – 10

క్లబ్ వరల్డ్ కప్‌లు – 3

Read Also: స్మృతి మందాన పెళ్లి వాయిదా.. ఆఖరి నిమిషంలో..!

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>