వేతనాలు లేక అవస్థలు.. ప్రీ ప్రైమరీ సిబ్బంది నిరసన

కలం, కరీంనగర్ : ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనిచేయాల్సిన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను సాయంత్రం వరకు విధుల్లో ఉంచడం శ్రమ దోపిడీతో సమానమని తెలంగాణ ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు (Pre-Primary Instructors), ఆయాల యూనియన్ రాష్ట్ర న్యాయ సలహాదారు జక్కనపల్లి గణేష్, రాష్ట్ర కో-కన్వీనర్ ఎం. లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఐడీఓసీ ముందు నిరసన తెలిపిన అనంతరం వారు మాట్లాడుతూ.. గత ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ప్రీ ప్రైమరీ స్కూల్ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్కువ జీతాల కారణంగా పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా జీవనం కొనసాగించడం ఇబ్బందిగా మారిందన్నారు.

అనధికారికంగా అమలు చేస్తున్న ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల పని సమయాన్ని తగ్గించాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్మికులకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ESI), ప్రావిడెంట్ ఫండ్ (PF) సౌకర్యాలు కల్పించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని, కనీస వేతన చట్టం ప్రకారం జీతాలను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రతినెల ఐదో తేదీలోపు జీతాలను వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలు లావణ్య, సుధా, రాజమణి, దివ్య, మమత, రమ్య, సాజిదా, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>