డీలిమిటేషన్‌తో బీసీలకు ఒరిగేదేమి లేదు: జాజుల శ్రీనివాస్

కలం, తెలంగాణ బ్యూరో: రాజకీయ నిరుద్యోగులను దొడ్డిదారిన చట్టసభలకు పంపించడానికి మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుందని, డీలిమిటేషన్ తో బీసీలకు ఒరిగేదేమీ లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) అన్నారు. సామాజిక సంఘ సంస్కర్త, మహాత్మ జ్యోతిబాపూలే 136వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు పెరుగుతున్న అవినీతిని, నిరుద్యోగ సమస్యని, అణగారిన వర్గాల అణచివేతని నిర్మూలించి సమసమాజానికి దారులు వేయాల్సిన కేంద్రం రాజకీయ ప్రయోజనాల కోసం, మెజార్టీ ప్రజలైన బీసీల హక్కులను కాలరాయడానికి నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దొంగ నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకొస్తున్న బీజేపీ చట్టసభల్లో కనీస ప్రాతినిధ్యం లేని ఓబీసీ మహిళలకు సబ్ కోట ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. బీసీలకు ప్రయోజనం లేని డీలిమిటేషన్, మహిళా బిల్లులను ప్రతిపక్ష పార్టీలు అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. జ్యోతిబాఫూలే జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వరకు, డీలిమిటేషన్ ప్రతిపాదనను విరమించుకునే వరకు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట కల్పించే వరకు కేంద్ర ప్రభుత్వంపై బీసీలు పెద్దఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని జాజుల పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>