కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుజాతనగర్ మండలం, స్టేషన్ బేతంపుడి గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటనలో రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బానోత్ బాబురావు రెండేళ్ల కుమారుడు యశ్వంత్ ఇంటి ముందు ఆడుకుంటూ బయటికి వెళ్లాడు.
అదే సమయంలో అటుగా వచ్చిన ప్రైవేట్ పాఠశాల బస్సు బాలుడిని ఢీకొట్టింది. బస్సు చక్రాల కింద పడటంతో యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

