Mobile Popup Ad
Mobile Popup Ad

క్లబ్ ఓనర్‌గా మెస్సీ.. ఫుట్‌బాల్ ప్రపంచంలో కొత్త ఇన్నింగ్స్

కలం, స్పోర్ట్స్​ : లియోనెల్ మెస్సీ (Lionel Messi).. ఫుట్‌బాల్ స్టార్‌ నుంచి తాజాగా సాకర్ క్లబ్ యజమానిగా మారాడు. ఇంతకాలం ఒక క్రీడాకారుడిగా ఫుట్‌బాల్ క్రీడకు సేవ చేసిన మెస్సీ.. ఇకపై క్లబ్ ఓనర్‌గా ఫుట్‌బాల్ భవిష్యత్తును మార్చడానికి సిద్ధమయ్యారు. స్పెయిన్‌లోని ఐదవ డివిజన్ క్లబ్ యూఈ కార్నెల్లా (UE Cornella) ను ఆయన అధికారికంగా కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇంటర్ మియామీ, అర్జెంటీనా తరపున ఆడుతూనే, మెస్సీ ఈ నిర్ణయం తీసుకోవడం కీలకంగా మారింది.

యువ ప్రతిభను వెలికితీయడంలో ఈ క్లబ్‌కు మంచి పేరుంది. గతంలో లూయిస్ స్వారెజ్‌తో కలిసి ఉరుగ్వేలో ‘డిపోర్టివో ఎల్‌ఎస్‌ఎం’ను ప్రారంభించిన మెస్సీకి, ఒక క్లబ్‌ను స్వతంత్రంగా కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి. జొర్డి ఆల్బా, గెరార్డ్ మార్టిన్ వంటి దిగ్గజ క్రీడాకారులు ఈ కార్నెల్లా క్లబ్ నుండే ఎదిగారు. ముఖ్యంగా ఆల్బా ఇక్కడి నుండి బార్సిలోనాకు మారి గొప్ప ఆటగాడిగా గుర్తింపు పొందారు. మెస్సీ (Lionel Messi) కంటే ముందే పలువురు బార్సిలోనా స్టార్లు క్లబ్ యజమానులుగా మారారు.

గెరార్డ్ పిక్ 2018లో ఎఫ్‌సీ అండోరాను కొనుగోలు చేసి, ఆ జట్టును సెగుండా డివిజన్‌కు చేర్చారు. అలాగే జొర్డి ఆల్బా, థియాగో అల్కాంటారా కూడా ‘సీఈ ఎల్ హాస్పిటలెట్’ అనే క్లబ్‌లో వాటాదారులుగా ఉన్నారు. బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో కూడా 2018లో రియల్ వల్లడోలిడ్‌లో మెజారిటీ వాటాను కొని, ఆ తర్వాత 2024/25 సీజన్ ముగింపులో 50 మిలియన్ యూరోలకు విక్రయించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>