Mobile Popup Ad
Mobile Popup Ad

బీఆర్ఎస్ మరో భారీ సభ.. వర్కవుట్ అవుతుందా?

కలం, వెబ్ డెస్క్:  గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తనకు గట్టి బలం ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఘోర పరాభవం పాలైంది. మరీ ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో తన పట్టును కోల్పోయింది. తిరిగి బలం పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నా.. అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోతుంది. ఈ క్రమంలోనే.. జీవన్ రెడ్డి చేరికను పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ స్థాయిలో కేసీఆర్ (KCR) భారీ సభను నిర్వహించారు. ఈ సభకు కేవలం ఉమ్మడి జిల్లా నుంచి కనీసం లక్ష మందితో నిర్వహించాలని ప్రణాళికలు వేసుకున్నారు. చాన్నాళ్ల తరువాత కేసీఆర్ బయటకు రావడంతో.. వచ్చిన కార్యకర్తల్లో ఆ జోష్ నెలకొంది. ఇక నుంచి గులాబీ అధినేత తరచూ ప్రజల్లోకి వస్తారనే అభయాన్ని పార్టీ ఇచ్చినట్లయిందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.

వరంగల్‌లో భారీ సభ..

కరీంనగర్ తరువాత తనకు పట్టున్న మరో కీలక జిల్లా వరంగల్ లో త్వరలోనే కేసీఆర్ భారీ సభను నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు.. ఇటీవల తనను కలిసిన ఉమ్మడి జిల్లా నేతలతో చర్చ జరపారని తెలుస్తోంది. గతేడాది పార్టీ ప్లీనరీని వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ.. ఈసారి సభను రైతుల కోణంలో నిర్వహించబోతుందనే ఊహాగానాలు వస్తున్నాయి. రైతులు, రైతు కూలీలను ఆదుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించింది. వరంగల్ వేదికగా.. మరోసారి ఇదే అంశాన్ని ఎత్తి చూపాలని గులాబీ దళం భావిస్తోంది. మరోవైపు, పార్టీ కార్యకర్తలు, నాయకులను వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలనే ఆలోచన చేస్తోంది. అయితే, గులాబీ దళపతి బయటకొస్తారా.. సభ నిర్వహిస్తారా.. అనే ప్రశ్నలు ప్రస్తుతానికి ఆసక్తికరంగా ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>