జ‌న‌గామ‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో లైన్ మెన్ మృతి

కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా చీటకోడూర్ రిజర్వాయర్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద లైన్‌ను తనిఖీ చేస్తుండగా లైన్‌మెన్‌ రాధమల్ల కరుణాకర్ రెడ్డి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ఆయన విద్యుత్ స్తంభం ఎక్కినట్లు సమాచారం.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. కరుణాకర్ రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>