Mobile Popup Ad
Mobile Popup Ad

శ్రీశైలం పాలిటెక్నిక్ కాలేజీలో చిరుతలు హల్‌చల్

కలం, వెబ్‌ డెస్క్‌ : శ్రీశైలం (Srisailam) పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో రెండు చిరుత పులులు సంచరించడం తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో కళాశాల ఆవరణలోకి ప్రవేశించిన ఈ పులులు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ సమయంలో విధుల్లో ఉన్న వాచ్‌మెన్‌ను గమనించిన చిరుతలు లోపలికి రాకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాయి. ప్రస్తుతం కళాశాలకు సెలవులు ఉండటంతో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతలను బంధించి అడవిలోకి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>