కల్హేర్ ప్రాంతంలో చిరుత కలకలం.. దూడపై దాడి

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా కల్హేర్ (Kalher) మండలం బీబీపేట్ ప్రాంతంలో చిరుత కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివారం రాత్రి పొలం దగ్గర కట్టేసిన దూడపై దాడి చేసి చంపేసింది. తెల్లారి పొలం దగ్గరకు వచ్చి చూసిన రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు రైతు సమాచారం అందించారు.

కొంతకాలంగా కల్హేర్ అటవీప్రాంతంలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో పొలాలకు వెళ్లాలంటే రైతులతో పాట సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>