Mobile Popup Ad
Mobile Popup Ad

కాకతీయ ఎక్స్‌ప్రెస్‌‌కు తప్పిన ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: కాకతీయ ఎక్స్‌ప్రెస్‌‌కు వరంగల్ (Warangal జిల్లాలో భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి మణుగూరు వెళ్తున్న రైలు.. వరంగల్ నెక్కొండ రైల్వేస్టేషన్ సమీపానికి రాగానే వెంటనే నిలిచిపోయింది. రైల్వే ట్రాక్ ఆనుకుని ఉన్న పొలంలో వరి కొయ్యలు తగలబెట్టేందుకు రైతులు నిప్పు పెట్టడంతో ఆ మంటలు రైల్వే ట్రాక్ వరకు వచ్చాఆయి. ఇది గమనించిన లోకో పైలట్లు.. వెంటనే రైలును నిలిపివేసి.. స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం, వారు స్థానికులతో కలిసి పొలాల్లో మంటలు ఆర్పేయడంతో అర గంట తరువాత బయల్దేరింది.

విచారణకు ఆదేశం..

రైలు అర గంట నిలిచిపోయిన ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల కాలంలో ట్రాక్‌ల వెంబడి ఉన్న పొలాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో.. రైతులకు అవగాహన కల్పించాలని స్టేషన్ల సిబ్బందికి సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>