Mobile Popup Ad
Mobile Popup Ad

అనుమానమే పెనుభూతమై.. గంటల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్: అనుమానమే పెనుభూతంలా మారి.. నెల కిందటనే పెళ్లి చేసుకున్న కొత్త జంటను ఆత్మహత్య (Suicide) చేసుకునేలా చేసింది. సిద్దిపేట జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఇది. కొమురవెల్లికి చెందిన వినయ్, కొండపాకకు చెందిన అంజలి గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి, ఏప్రిల్ 9న ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే, తాను ఇంట్లో లేనప్పుడు భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోందని వినయ్ కొద్ది రోజులుగా అనుమానిస్తున్నాడు. ఇదే విషయమై పలుమార్లు భార్యతో గొడవకు దిగాడు. ఈ నెల 7న అంజలిని పుట్టింట్లో వదిలేసి వచ్చాడు.

స్నేహితులకు లొకేషన్ పంపించి..

ఆదివారం వినయ్ మరోసారి అంజలికి ఫోన్ చేయగా.. బిజీ బిజీ అని వస్తుండటం, కాసేపటి తరువాత ఆమె ఫోన్ చేయడంతో గొడవకు దిగాడు. దీంతో తీవ్ర మనస్థాపంతో అంజలి పుట్టింట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ నుంచి వస్తున్న వినయ్‌కు ఈ విషయం తెలియడంతో కుకునూర్‌పల్లి సమీపంలోని రాయవరం వద్ద బైక్ ఆపేసి.. తండ్రికి ఫోన్ చేశాడు. ‘ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పి ఫోన్ పెట్టేసి, స్నేహితులకు తన లొకేషన్ పంపించాడు. అనంతరం, అక్కడే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు, స్నేహితులు వచ్చి చూసేసరికి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. గంటల వ్యవధిలోనే కొత్త జంట ఆత్మహత్య చేసుకోవడంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>