epaper
Wednesday, February 18, 2026
epaper

క్లాస్​రూమ్​లో తోటి విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపాడు

కలం, వెబ్​డెస్క్​: పంజాబ్​లోని (Punjab) ఓ లా కాలేజీలో షాకింగ్​ ఘటన జరిగింది. తోటి విద్యార్థిని కాల్చి చంపి, తానూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు మరో విద్యార్థి (Law Student Shot Dead). ఈ తతంగం సీసీ కెమెరాల్లో రికార్డవడంతో వైరలైంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. తర్న్​​ తరన్​ జిల్లా ఉస్మాలోని మై భాగో లా కాలేజీలో ప్రిన్స్​ రాజ్​, సందీప్​ కౌర్​ చదువుతున్నారు. సోమవారం ఉదయం క్లాసులు ప్రారంభమవుతాయనగా, క్లాస్​రూమ్​లోకి వచ్చిన ప్రిన్స్​ రాజ్​.. అప్పటికే అక్కడ ఉన్న సందీప్​ కౌర్​తో ఏదో విషయమై మాట్లాడాడు.

కాసేపటికి సందీప్​ కౌర్​ చివరి బెంచీలోకి వెళ్లి కూర్చుంది. మరో విద్యార్థి పక్కనే నిలబడి మాట్లాడుతోంది. వాళ్లతోపాటు అక్కడికి వచ్చిన ప్రిన్స్​ రాజ్​ హఠాత్తుగా బ్యాగ్​​ తెరిచి అందులోని గన్ బయటకు తీశాడు. పాయింట్​ బ్లాంక్​ రేంజ్​లో సందీప్​ కౌర్​ తలకు గురిపెట్టి కాల్చాడు. అనంతరం తనను తాను కాల్చుకొని కింద కూలబడిపోయాడు. ఈ హఠాత్ సంఘటనతో అక్కడే ఉన్న మరో విద్యార్థికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. తర్వాత సందీప్​ కౌర్​ను పట్టుకొని పైకి లేపేందుకు ప్రయత్నించారు. అయితే, సందీప్​ కౌర్​ అప్పటికే చనిపోయింది.

కాల్పుల శబ్దం విని విద్యార్థులు, లెక్చరర్లు తరగతి గది లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు. విషమ పరిస్థితిలో ఉన్న ప్రిన్స్​ రాజ్​ను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ కాల్పులకు కారణమేదో తెలియరాలేదు (Law Student Shot Dead). పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: తెలంగాణ రాజకీయాలను మునుగోడు నుంచే శాసిస్తా : రాజగోపాల్ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>