Mobile Popup Ad
Mobile Popup Ad

గుజరాత్ విజయం.. ఒక్క పరుగు తేడాతో ఓడిన ఢిల్లీ

కలం, వెబ్ డెస్క్:  ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హైటెన్షన్ వార్ కొనసాగింది. చిట్టచివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగిన పోరులో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఆఖరిలో రెండు బంతులకు రెండు పరుగులు చేయాల్సిన సమయంలో ప్రతిసిద్ధ్ కృష్ణా అద్భుతమైన బౌలింగ్‌ను కనబరిచాడు గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ అద్భుతమైన స్కోర్ అందిస్తే.. దానికి ధీటుగా ఢిల్లీకి కేఎల్ రాహుల్ అండగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ తమ విశ్వరూపాలను చూపారు. కానీ ఇందులో కేఎల్ రాహుల్ శ్రమ వృథా అయింది. ఆఖరి వరకు పోరాడిన ఢిల్లీని ఓటమి పలకరించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 45 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నడిపించగా, జోస్ బట్లర్ (52) మెరుపు హాఫ్ సెంచరీతో అలరించాడు. ఆఖరిలో వాషింగ్టన్ సుందర్ కేవలం 32 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీసినప్పటికీ 55 పరుగులు సమర్పించుకోగా, లుంగి నిగిడి, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకు పోరాడి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఢిల్లీ కెప్టెన్ కేఎల్ రాహుల్ 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు చేసి వీరోచిత పోరాటం చేసినా, సెంచరీ ముంగిట సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అవ్వడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఓపెనర్ పాతుమ్ నిశ్శంక (41) శుభారంభం ఇచ్చినా, రషీద్ ఖాన్ (3/17) తన స్పిన్ మ్యాజిక్‌తో నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్‌లను పెవిలియన్ పంపి ఢిల్లీని కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆఖరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ (41*) సిక్సర్లతో విరుచుకుపడి గెలుపు ఆశలు రేకెత్తించినా, ప్రసిద్ధ్ కృష్ణ చివరి రెండు బంతుల్లో వికెట్లు పడగొట్టి గుజరాత్‌కు అపురూప విజయాన్ని అందించాడు. రాహుల్ శ్రమ వృధా అవ్వగా, గిల్ సేన పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>