కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సర్ ప్రక్రియపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రధానంగా మూడు రకాల డిమాండ్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మొదటిది కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయడం, రెండోది సర్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం, మూడోది బ్యాలట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించడం. దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రధానంగా ఈ మూడింటిని కోరుకుంటున్నారని వివరించారు. వీటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.
దీనిపై దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీధి పోరాటాలకు సిద్ధంగా ఉన్నారని మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) స్పష్టం చేశారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతలా మారిపోయిందని.. చివరికి జర్నలిస్టులను కూడా వదలడం లేదని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనల సందర్భంగా మహిళా జర్నలిస్టు పట్ల వ్యవహరించిన తీరు దారుణమన్నారు. ఇది పూర్తిగా ఖండించదగిన విషయమన్నారు. వెంటనే మహిళా జర్నలిస్టుపై అనుచితంగా ప్రవర్తించిన పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : సోషల్ మీడియాలో బండ్ల గణేష్ వరుస పోస్టులు.. కారణం అదేనా?
Follow Us On: Youtube

