Mobile Popup Ad
Mobile Popup Ad

దేశంలో ఆయారాం.. గయారాం సంస్కృతి తెచ్చిందే కాంగ్రెస్‌: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్ : దేశంలో ఆయారాం.. గయారాం సంస్కృతి తెచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.2004లో మాకు 26 మంది ఎమ్మెల్యేలుంటే 10 మందిని లాక్కున్నారని ఆగ్రహించారు. అసెంబ్లీలో సభా మర్యాదలు మంటగలుస్తున్నాయని.. సంస్కారాలకు దహన సంస్కారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సభ్యతను సమాధి చేస్తున్నారని.. బజారు భాషలో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రే స్వయంగా బడివె అని మాట్లాడితే మీరు సరి చేయలేదని స్పీకర్ ను అడిగారు. గ్రహణం కూడా కొంతకాలమే ఉంటుందని గుర్తించాలని ఆయన హితవు పలికారు.

అధికారం ఇచ్చారనే అహంకారంతో అతిగా వ్యవహరించవద్దని కోరుతున్నట్లు తెలిపారు. ఉద్యమాల్లో ఉగ్గుపాలు తాగి వచ్చాం.. మాపై కేసులు పెట్టినా భరిస్తామని స్పష్టం చేశారు. కమిషన్లు వేసినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా భరిస్తామని.. తెలంగాణ తరఫున ప్రశ్నించడం మాత్రం ఆపమని తేల్చి చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే మాత్రం ఆగే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ ఖ్యాతికి మచ్చ తెస్తే మాత్రం మౌనంగా ఉండమన్నారు. తెలంగాణ హక్కులకు నష్టం వాటిల్లితే చూస్తూ ఊరుకోమని కేటీఆర్ (KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also: మాటకు కట్టుబడి రాజీనామా చేయాలి.. కేటీఆర్ పై సీతక్క ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>