Mobile Popup Ad
Mobile Popup Ad

అమ్మాయిలు, ఆంటీల మాటలు నమ్మి యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నారా? బీ అలర్ట్

కలం వెబ్ డెస్క్: ‘అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడాలనుకుంటున్నారా.. అయితే ఈ యాప్ (App) ఇన్‌స్టాల్ చేసుకోండి’ అంటూ సోషల్ మీడియాలో కనిపించే ఈ యాడ్స్ వెనుక నిలువునా దోచేసే మోసం ఉంది. ఇదే విషయమై హైదరాబాద్ సీపీ (Hyderabad CP) సజ్జనార్ యువతను హెచ్చరించారు. ‘‘యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్ ఇది. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదు. అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు. మాయమాటలకు బుట్టలో పడి వారు సూచించిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లే. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయి’’ అని తెలిపారు.

‘‘రాత్రిపూట సరదాగా మాట్లాడుదమని వీడియో కాల్ (Video Call) చేస్తే.. అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, స్క్రీన్‌పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి, మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్‌మెయిలింగ్‌ సెక్స్‌టార్షన్‌కు దిగుతారు. పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయం’’ అని సజ్జనార్ (Sajjanar) హెచ్చరించారు.

‘‘యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌లో ఎవరూ మీకు ఊరికే స్నేహితులు కారు.. ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువు లాగేసే భారీ కుట్ర దాగి ఉందని గ్రహించాలి. క్షణికావేశంలో గుర్తుతెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. రాత్రి వేళల్లోనే ఈ యాడ్స్ దర్శనమిస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి’’ అని సజ్జనార్ (Hyderabad CP) సూచనలు చేశారు.

Read Also: మాటకు కట్టుబడి రాజీనామా చేయాలి.. కేటీఆర్ పై సీతక్క ఫైర్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>