బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన కేటీఆర్.. కవిత వ్యాఖ్యలపై ఏమన్నారంటే?

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. భారతదేశ చరిత్రలోనే 25 ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు కొన్ని మాత్రమే.. అందులో బీఆర్ఎస్ పార్టీ ఒకటని కేటీఆర్ అన్నారు.

14 ఏళ్లపాటు తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ సాధించారని, ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. ప్రజలు ఆశీర్వదించి అధికారమిస్తే కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టారని వ్యాఖ్యానించారు. గత రెండున్నరేళ్లుగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని వెల్లడించారు. ఇక ఇప్పుడు తెలంగాణను మళ్లీ గాడిన పెట్టేందుకు పోరాడతామని.. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ పునరంకితం అతువుందని స్పష్టం చేశారు. ఢిల్లీ గులాములైన కాంగ్రెస్, బీజేపీ పీడను రాష్ట్ర ప్రజలకు తొలగిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు.

అయితే కవిత పార్టీ, ఆమె చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ స్పందించేందుకు ఇష్టపడలేదు. కాగా, కవిత తన రాజకీయ పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (టీఆర్‌ఎస్‌)ను ప్రారంభించిన వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పోయిందని.. దారుణమైన నిఘా నీడలో బతకాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాదు కేసీఆర్ కుటుంబంలో భాగమైనందుకు కొన్ని విషయాల్లో క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>