వంట చేసిన కేటీఆర్.. ఎవ‌రి కోస‌మంటే?

క‌లం, వెబ్‌డెస్క్‌: ఎప్పుడూ రాజ‌కీయాల్లో బిజీగా ఉండే బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చెఫ్ అవ‌తార‌మెత్తారు. కేటీఆర్ వంట‌లు చేస్తున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోల‌ను స్వ‌యంగా ఆయ‌న కుమారుడు హిమాన్షు (Himanshu) శుక్ర‌వారం ఉద‌యం త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్టు చేశారు. కేటీఆర్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గుర‌య్యారు. దీంతో ప్ర‌స్తుతం ఆయ‌న ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే ఎక్స్ వేదిక‌గా గురువారం వెల్ల‌డించారు. వైరల్ ఫీవర్, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్న‌ట్లు చెప్పారు. ఇంట్లోనే వైద్య సేవలు పొందుతున్నాన‌ని. రెండు రోజుల్లో కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి వస్తాన‌ని ఆయ‌న పోస్టులో వెల్ల‌డించారు.

ఇక ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్ స‌ర‌దాగా కొడుకు కోసం వంట చేసి పెట్టారు. త‌న తండ్రికి ఆరోగ్యం బాగా లేక‌పోయినా త‌న కోసం జొన్న‌రొట్టె, ఎగ్ బుర్జి వండి పెట్టార‌ని హిమాన్షు త‌న పోస్టులో రాసుకొచ్చారు. త‌న‌కు ఈ ఫుడ్ ఎంత ఇష్ట‌మో తెలుసు కాబ‌ట్టే వండార‌ని చెప్పారు. ఈ పోస్టుకు ఓ నాలుగు ఫోటోల‌ను కూడా జోడించారు. కొడుకు కోసం కేటీఆర్ (KTR) చెఫ్‌గా మారాడంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

Also Read : మెట్రో స్టేషన్ల మూసివేత.. సీజేఐ ఆశ్చర్యం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>