కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో రేపు కాక్రోచ్ జనతా పార్టీ భారీ ఆందోళనలకు (CJP Protest) పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్త చర్యగా మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు కాగా.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) విచారించారు. అన్ని స్టేషన్లను మూసివేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ప్రతి ఒక్కరికి కారు ఉండదు కదా..? ఎలాంటి రవాణా సదుపాయం కల్పించకుండా ప్రజలను నిలువరించడం ఎంత వరకు కరెక్ట్.’. అని ప్రశ్నించారు. వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు ఢిల్లీ నుంచి గురుగ్రామ్, గ్రేటర్ నోయిడాతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారని.. వారికి ఇబ్బంది అవుతుంది కదా..? అని పేర్కొన్నారు.
మరో స్థలం చూపించండి..
ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపుకోవడమనేది ప్రాథమిక హక్కు అని.. దాన్ని కాదనలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) అన్నారు. ‘ప్రజలు తమ ఆందోళనను తెలుపుకోవడానికి ప్రభుత్వ అధికారులే మరో స్థలాన్ని వారికి చూపించండి. అత్యవసరమైతే సులభంగా వెళ్లగలిగేలా ఉండాలి. ఆందోళన చేస్తున్నవారిలో పిల్లలు కూడా ఉండొచ్చు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే వెంటనే స్పందించడానికి అనువుగా ఉండాలి’ అని సూచించారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా స్పందిస్తూ.. రైల్వే, మెట్రో సర్వీసుల పరంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని సీజేఐకి తెలిపారు. అలాగే.. మెట్రో స్టేషన్ల ఎగ్జిట్ పాయింట్ల మూసివేతపై కూడా ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతానని పేర్కొన్నారు.
Also Read : కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ సంచలన ఆరోపణలు
Follow Us On: Youtube

