Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్‌కి మరో హీరోయిన్ మద్దతు..

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 108 సీట్లతో మెజారిటీ ఉన్న టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో టీవీకే అధినేత విజయ్ (TVK Vijay) కి తమిళనాట ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. రాజకీయ నాయకులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభిస్తోంది.

హీరోయిన్ శ్రియ కూడా ఇన్ స్టా వేదికగా తమిళనాడు గవర్నర్ రాజేందర్ విశ్వనాథ్ అర్లేకర్ పై అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ తీరును వ్యతిరేకిస్తూ.. కమల్ హాసన్ పోస్ట్ ను శ్రియ షేర్ చేశారు. ‘టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. వారిని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడం తమిళనాడు ప్రజలను అవమానించడమే. 233 మంది గెలిచిన సభ్యులు ఇంకా ప్రమాణం చేయడానికి అవకాశం లేకుండా పోయింది’ అని కమల్ హాసన్ పోస్ట్ చేయగా తాజాగా నటి శ్రియ దానిని షేర్ చేస్తూ విజయ్ కి సపోర్ట్ చేశారు.

కాగా, విజయ్ కి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండడంతో టీవీకే పార్టీ శ్రేణులకు ఉత్సాహం పెరుగుతోంది. ఈ ఒత్తిళ్ల మధ్య తమిళనాడు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>