కలం, వెబ్ డెస్క్: శంతను నారాయణ్ (Shantanu Narayen) అడోబ్ సంస్థ సీఈఓగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. 18 ఏళ్ల అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన మిత్రుడు శంతను నారాయణ్‌కు హృదయపూర్వక అభినందనలు అంటూ.. శంతను వంటి బలమైన నాయకులకు వినయం, సహానుభూతి అనేవి ప్రధాన గుర్తింపు చిహ్నాలని, భారత్‌తో పాటు ముఖ్యంగా తన సొంత నగరం హైదరాబాద్‌పై ఆయనకున్న మక్కువ ఎప్పుడూ ప్రశంసనీయమని కేటీఆర్ కొనియాడారు. అడోబ్‌లో శంతను సాగించిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. విశ్రాంతి తీసుకోవడానికి ముందే ఇంకా సాధించాల్సిన విజయాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు.

