కలం, వెబ్ డెస్క్ : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గాయపడ్డారనే వార్త అభిమానులను కలవరపెడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఆయన గాయాన్ని పరిశీలించిన వైద్యులు.. జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
అయితే ఈ గాయంపై అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ టీమ్ తెలిపింది. ఈ అంశానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని తగిన సమయంలో ఎప్పటికప్పుడు అందిస్తామని ప్రకటనలో వెల్లడించింది.

