కేసీఆర్ ఒక కల్పవృక్షం.. రేవంత్ ఒక కలుపు మొక్క: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘాటుగా స్పందించారు. రైతు బాధలు పట్టించుకోకుండా ఈ రోత భాష ఏందీ? రేవంత్ రెడ్డి అంటూ నిలదీశారు. తమ నేత కేసీఆర్ ఒక కల్పవృక్షం అయితే.. రేవంత్ ఒక కలుపు మొక్క అని విమర్శించారు. తెలంగాణ రైతాంగంకరువు, కన్నీళ్లతో అల్లాడుతుంటే నువ్వు చిల్లర మాటలతో చిందులు తొక్కుతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జై తెలంగాణ అనలేని ద్రోహి రేవంత్..

జై తెలంగాణ అనలేని ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.నీళ్ల దోపిడి జరుగుతుంటే నిద్ర నటిస్తున్నాడని.. నిజాలు చెప్పేవాళ్ల మీద నిందలు మోపుతావా? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అమరుల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడది? అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పథకాలకు పాతరేసి, అవినీతి జాతర చేస్తూ అబద్ధాలతో అరుపులతో ఇంకెన్నాళ్లు కాలం వెళ్లదీస్తవ్ రేవంత్ అంటూ మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ప్రతి నియోజకవర్గం ఒక సిద్దిపేట, సిరిసిల్ల లెక్కన గర్జించి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం ఖాయమని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>