కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) సంస్మరణ సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక ప్రకటన చేశారు. రెండేళ్లలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని.. నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టి తీరుతామని స్పష్టం చేశారు. ఎంతకాలం బతికినం అనేది ముఖ్యం కాదని.. ఎలా బతికామనేదే ముఖ్యమని చెప్పారు. ఇందుకు నిదర్శనం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు తరలివచ్చిన జనం అని అన్నారు. సుమారు లక్షకు పైగా మంది 12 గంటలపాటు వర్షం పడుతున్నా ఎక్కడికి వెళ్లకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారని చెప్పారు.

