బస్సులో దారుణం.. పొట్టు పొట్టు కొట్టుకున్న కండక్టర్, మహిళా ప్రయాణికురాలు..!

కలం, వెబ్ డెస్క్ : కర్ణాటకలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బెలూరు నుంచి హాసన్ వెైపు వెళ్తున్న ఆర్టీసీ (KSRTC ) బస్సులో కండక్టర్, మహిళా ప్రయాణికురాలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బస్సు ప్రయాణంలో ఉండగా టికెట్ విషయమో? సీటు విషయమో? తెలియదు కానీ.. కండక్టర్‌కు మహిళా ప్రయాణికురాలికి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దీంతో నియంత్రణ కోల్పోయిన కండక్టర్ సదరు మహిళపై దారుణంగా దాడికి దిగింది. తోటి ప్రయాణికులు చూస్తుండగానే ఆమెను బస్సులోనే కిందపడేసి, జట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లింది. ప్రయాణికురాలు కూడా కండక్టర్‌పై విరుచుకుపడింది.

ఈ క్రమంలోనే అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఈ సమయంలో ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని కండక్టర్‌కు మద్దతుగా నిలుస్తూ సదరు మహిళా ప్రయాణికురాలిపై దాడికి దిగడం గమనార్హం. బస్సులో ఉన్న ప్రయాణికులు ఈ దృశ్యాలను మొబైల్‌లో రికార్డ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో అసలు తప్పు ఎవరిది? అంతలా గొడవ జరగడానికి కారణం ఏంటనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Read Also: అమ్మాయిల్లో పెరుగుతున్న స్మోకింగ్ హ్యాబిట్.. హెల్త్‌కి రిస్క్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>