పెట్రోల్ దాడిలో కాంగ్రెస్ నేత మృతి

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) నగరంలో 14వ డివిజన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఆడుప మహేష్ మరణించారు. నిన్న రాత్రి జరిగిన పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన మహేష్‌ను తొలుత ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. దీంతో, పోస్టుమార్టం నిమిత్తం తిరిగి ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: అమ్మాయిల్లో పెరుగుతున్న స్మోకింగ్ హ్యాబిట్.. హెల్త్‌కి రిస్క్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>