కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ నటి కృతి సనన్ (Kriti Sanon GIVA Ad) నటించిన జ్యువెలరీ బ్రాండ్ ‘జీవా’ ప్రకటన వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. రక్షాబంధన్ నేపథ్యంలో రూపొందించిన ఈ యాడ్ లో కృతి సనన్ ధరించిన దుస్తులు వివాదానికి కారణంగా నిలిచింది. భారతీయ సంస్కృతి, సంప్రాదాయాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన యాడ్ లో కృతి సనన్ అలాంటి దుస్తులు ధరించి రాఖీ కడతారా? అంటూ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనాతో సహా పలువురు నెట్టింట ఫైర్ అయ్యారు. దీంతో ‘జీవా’ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
తాము కృతి సనన్ తో రూపొందించిన యాడ్‌ను అన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించినట్లు ‘జీవా’ సంస్థ ప్రకటించింది. ఎవరి మతపరమైన, సాంస్కృతిక మనోభావాలను దెబ్బతీయాలను ఉద్దేశంతో తాము ప్రకటనను రూపొందించలేదని తెలిపింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలపై తమకు అత్యంత గౌరవం ఉందని చెప్పింది. అయినప్పటికీ యాడ్ ద్వారా కొందరి మనోభావాలను అనుకోకుండా బాధపెట్టి ఉంటే చింతిస్తున్నామని పేర్కొంది. అందుకే అందరి భావాలను గౌరవిస్తూ ప్రకటనను అన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించినట్లు స్పష్టం చేసింది.

