కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే

కలం, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల మండలానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ (Korutla MLA Kalvakuntla Sanjay) లబ్ధిదారులకు అందజేశారు. రూ.29,03,364 (ఇరవై తొమ్మిది లక్షల మూడు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయలు) విలువగల చెక్కులను ( Kalyana Lakshmi Cheques) ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడపిల్లల పెళ్లి భారం పేద తల్లిదండ్రులపై పడొద్దని కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పథకాన్ని సజావుగా కొనసాగిస్తూ.. ఎలాంటి ఆలస్యం చేయకుండా చెక్కులు పంపిణీ చేయాలన్నారు. ఎన్నికల హామీలో భాగంగా అదనంగా ఇస్తానన్న తులం బంగారాన్ని కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దారిశెట్టి రాజేష్, అయిలాపూర్ సర్పంచ్ సందయ్య, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read : ఫైనల్‌‌కు ప్రీతి పవార్.. భారత్‌కు పతకం ఖాయం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>