కలం, నిర్మల్: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని నిర్మల్ జిల్లా బీజేవైఎం (Nirmal BJYM) అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో శుక్రవారం బైంసా పట్టణంలోని గురుకృప ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ‘సంతకాల సేకరణ’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భైంసా పట్టణ అధ్యక్షుడు రావుల రాము, బీజేవైఎం నాయకులు షిండే గంగాప్రసాద్, ఆకుల రంజిత్, స్వరాజ్, దిలీప్, విద్యార్థులు పాల్గొన్నారు.
Also Read : సీఎం విడాకులకు సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్!
Follow Us On : WhatsApp

