మంత్రి కొండా సురేఖ మరోసారి కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించేందుకు మంత్రి కొండా సురేఖ (Konda Surekha) నిరాకరించారు. ‘సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చాక ఆయన్ను కలిసి.. అన్ని విషయాలు మాట్లాడుతా. నేను చెప్పాల్సినదంతా ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చెప్పేశాను. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది కూడా ఏం లేదు’ అని స్పష్టం చేశారు. ఆమెను కలిసేందుకు కొందరు మీడియా ప్రతినిధులు ఇంటికి వెళ్లగా.. ఇంట్లో పూజా కార్యక్రమంలో ఉన్నానని, ఇప్పుడేం మాట్లాడలేనని చెప్పారు. ఆ సమయంలో మంత్రి సురేఖ పక్కనే కుమార్తె సుస్మిత కూడా ఉన్నారు.

సీఎం వచ్చిన తరువాతనే..

సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన నుంచి వచ్చాకే కొండా సురేఖ, కొండా సుస్మిత విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఊపందుకుంది. ఇప్పటికే సుస్మిత మాట్లాడిన వీడియోలు, కొండా సురేఖ పంపించిన షోకాజ్ నోటీస్ రిప్లై కాపీలను అధిష్ఠానం తెప్పించుకున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు, ఉదయం 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>