ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాటం ఆగదు: కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: ఓటు హక్కును హరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదని మాజీ సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) అన్నారు. మోదీ కనుసన్నల్లో జరుగుతున్న ఈసీ అక్రమాలకు నిరసనగా శాంతియుతంగా ధర్నా చేసిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లపై పోలీసులచే దాడి చేయించిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముకరంపుర (Mukarampura) లోని తన కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలతో కలిసి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. లోక్ సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మోదీ కనుసన్నల్లో చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ చేసిన తప్పిదాలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోలీసులచే దాడి చేపించి అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని అటువంటి ఓటు హక్కును కేంద్రం ప్రభుత్వం సీఈసీని అడ్డుపెట్టుకుని అన్యాయం చేస్తోందని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.

రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి దేశ ప్రజల పూర్తి మద్దతుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఫాం 6 లో 2002లో ఓటు హక్కు పొందిన వారి వివరాలు నమోదు చేయాలని ఉందని, అప్పుడు ఓటు వేయని వారి కుటుంబాల పరిస్థితేంటని ప్రశ్నించారు. బోగస్ ఫాం 7 ద్వారా బోగస్ సంతకాలు పెట్టి బీజేపీ నాయకులు ఓట్లు కొల్లగొడుతున్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు.

అన్ని అక్రమాలకు జ్ఞానేశ్ కుమార్ మద్దతు ఉందని అందుకే జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే రాజీనామా చేయాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇదే విధంగా కొనసాగుతే అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు మేం సిద్దంగా ఉన్నామని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.

ఈ నిరాహార దీక్షలో ఎండీ తాజ్, కార్పోరేటర్లు వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నిహాల్ అహ్మద్, ఎండీ చాంద్, ముక్క భాస్కర్, లాయక్, షబానా మహమ్మద్, కుర్ర పోచయ్య, ముల్కల కవిత, అస్థాపురం తిరుమల, జ్యోతి రెడ్డి, మహాలక్ష్మి, మిరాజ్, జీడి రమేష్, అస్థాపురం రమేష్, గోనె స్వప్న, జిలకర రమేష్, సాయిరాం, భారీ, బషీర్, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>