కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు ఖరారు

కలం, వెబ్ డెస్క్: ఏపీలో జడ్పీ ఎన్నికల్లో భాగంగా ఎన్డీయే కూటమి (NDA Alliance) పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు అయింది. రేపు డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీకి 7 డిప్యూటీ మేయర్ స్థానాలు, 59 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైస్ ఛైర్ పర్సన్ స్థానాలను కేటాయించారు. జనసేనకు 23, బీజేపీ 9 స్థానాలు కేటాయించారు. టీడీపీకి అనంతపురం, కడప, ఒంగోలు, విజయవాడ, విజయనగరం, ఏలూరు కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్ స్థానాలు దక్కాయి. ఇప్పటికే జడ్పీ ఛైర్మన్లలో మెజార్టీ సీట్లను టీడీపీనే దక్కించుకున్న విషయం తెలిసిందే. రేపటితో జడ్పీ ఎన్నికల అంకం సమాప్తం కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>